TG | బాసర ఆలయంలో మంత్రి సీతక్క పూజలు
బాసర, జనవరి 30 (ఆంధ్ర ప్రభ) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి సన్నిధిలో గురువారం జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అమ్మవారి సన్నిధిలో మంత్రి సీతక్క చే అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి హారతినిచ్చి ఆశీర్వదించారు.
ఆనంతరం మంత్రి సీతక్కకు ఆలయ అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాన్ని ఆలయ చైర్మన్ శరత్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, స్థానచార్యులు ప్రవీణ్ పాటక్ అందజేశారు. వీరి వెంట ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.