TG | నీళ్లు-నిజాలు.. జాగృతి స‌మావేశం

సాగునీటి ప్రాజెక్టులపై 31న రౌండ్‌ టేబుల్‌ భేటీ
పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

ఇరిగేషన్‌ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను పటాపంచలు చేసేందుకు ఈనెల 31న సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఉదయం 11 గంటల నుంచి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్లు రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరవుతారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా గతంలో కేసీఆర్‌ నిర్మించిన కీలక ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నదని ఈ రౌండ్‌ టేబుల్‌లో ఆమె పలు కీలక అంశాలను వెల్లడించనున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికను ప్రజల ముందు పెట్టాలని తెలంగాణ జాగృతి సంస్థ డిమాండ్‌ చేసింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, ఆ మేరకు తీర్మానాలను ఆమోదిస్తామని జాగృతి సంస్థ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *