Delhi | నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు ఆమోద ముద్ర

  • మోదీ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ మీటింగ్
  • ఈ మిష‌న్ కు రూ. 16,300 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ ను అమలు చేయనుంది. మన దేశంలో, ఆఫ్షోర్ ప్రదేశాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ను చేపట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారాలశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఈ రంగంలో దేశ స్వావలంబనను సాధించడమే ఈ మిషన్ లక్ష్యమన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు ఈ తరహా వనరులు అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దేశీయంగా అరుదైన ఖనిజ నిల్వల్ని అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

మరోవైపు, సి హెచ్పీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధర లీటరు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు వైష్ణవ్ వెల్లడించారు. అలాగే, బి హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్, చెరకు రసం/చక్కెర/చక్కెర సిరప్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *