IND vs ENG | టాస్ గెలిచిన టీమిండియా.. ఫ‌స్ట్ బౌలింగ్ మ‌న‌దే !

  • తుది జట్టులోకి షమీ ఎంట్రీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్ప‌టికే 2-0తో లీడ్ లో ఉన్న టీమిండియా.. మరో ర‌స‌వ‌త్త‌ర‌ పోరుకు రెడీ అయ్యింది. ఈరోజు రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ కు ఇరు జట్లు సిద్ధ‌మ‌య్యాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ చేపట్టనుంది.

జట్టు మార్పులు:

భారత్ : అర్ష్‌దీప్ సింగ్ (విశ్రాంతి) స్థానంలో తుది జ‌ట్టులోకి మహ్మద్ షమీ ఎంట్రీ ఇచ్చాడు.

టీమిండియా : సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ.

ఇంగ్లండ్ : జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్), హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, మార్క్ వుడ్, జామీ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, బెన్ డకెట్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *