Uttarpradesh – అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపి అరెస్ట్

ల‌క్నో – ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ ను నేడు యూపీ పోలీసులు అరెస్టు చేశారు. సీతాపుర్ ఎంపీగా ఉన్న ఆయనపై అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. సీతాపుర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన్ను అరెస్టు చేసి భారీ పోలీసు భద్రత నడుమ ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు.

వివరాలలోకి వెళితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ను సైతం పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎంపీ రాథోడ్ అలహాబాద్ హైకోర్టు లఖ్ నవూ బెంచ్లో నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. రెండు వారాల్లోగా సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని సూచించింది.. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నివాసం వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *