Kurnool | లిఫ్ట్ ప్రమాదంలో సీనియర్ టెక్నీషియన్ మృతి

.

కర్నూలు బ్యూరో, జనవరి 30, ఆంధ్రప్రభ ఎల్కూర్ ఏస్టేట్ లో లిఫ్ట్ ప్రమాదంలో వినోద్ అలియాస్ జాన్సన్ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 19వ వార్డులో ఉన్న ఎల్కూర్ ఎస్టేట్ లో కలెక్టరేట్ రిటైర్ కారు డ్రైవర్ శ్రీరాములు మూడు అంతస్తుల భవనానికి లిఫ్ట్ రిపేరు వచ్చింది. దీంతో కేరళ నివాసి హైదరాబాదులో స్థిరపడిన వినోద్ అలియాస్ జాన్సన్ సీనియర్ లిఫ్ట్ టెక్నీషియన్ తో పాటు ఇద్దరూ హెల్పర్స్ డేవిడ్, సాయిలతో కలిసి లిఫ్ట్ రిపేరు చేస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ కిందకు జారింది.దీంతో లిఫ్ట్ కింద ఉన్న సీనియర్ టెక్నీషియన్ వినోద్ ప్రాణాలు కోల్పోయారు. హెల్పర్స్ ఇద్దరికీ గాయాలు అయ్యాయి.

కేరళ సిపిఎం పార్టీ నాయకులు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కి ఫోన్ ద్వారా సమాచారం తెలియజేయడంతో సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి.రాముడు. నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ .నర్సింలు. నగర కమిటీ సభ్యులు బి. రాధాకృష్ణ .మాలిక్. వార్డు పార్టీ సభ్యులు జయన్న .పెదబాబు. చిన్నమాలిక్, గౌండ శ్రీనివాసులు, డి మార్ట్ స్టాండ్ ఆటో డ్రైవర్లు సంఘటన స్థలానికి వెళ్లి సందర్శించి ఇంటి యజమాని పోలీసులతో మాట్లాడి రావడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన వినోద్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *