TG | రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
రాష్ట్ర, దేశ ప్రజలకు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామిక పాలన వచ్చి గణతంత్ర రాజ్యంగా అవతరించి 76 ఏళ్లు అవుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించినందుకు రాజ్యాంగ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చేందుకు పాలకులు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకిక వాద మౌలిక విలువలను అనుసరిస్తూ.. ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.