Telangana | ప్రొఫెసర్ల వయో పరిమితి 65 కి పెంపు
హైదరాబాద్ – రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేసే ప్రొఫెసర్ల వయో పరిమితి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు వయో పరిమితిని పెంచారు.
ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్ పొందుతున్న వారికి మాత్రమే ఈ నిబంధన అమలవుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా యూనివర్సిటీల్లో టీచింగ్ స్టాఫ్ నియమకాలు నిలిచిపోయాయి.దీంతో యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది తీవ్ర కొరత ఉంది. ఈ నేపథ్యంలో క్లాసులు సజావుగా సాగడానికి వయో పరిమితి పెంపు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో వయో పరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని 12 యూనివర్సిటిల్లో 2817 టీచింగ్ స్టాఫ్పోస్టులు ఉండగా వీటిలో 757 మందే పనిచేస్తున్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన పోస్టులన్ని ఖాళీగా ఉన్నాయి.