ADB | గోదావరి తీరం.. భక్తజన సంద్రం

బాసర, జనవరి 29, ఆంధ్రప్రభ : బాసర పుణ్యక్షేత్రం గోదావరి నది తీరం భక్తజన సంద్రంగా మారింది. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల పుణ్యస్నానాలతో గోదావరి ఘాట్ లు భక్తులతో కిటకిటలాడాయి.

మౌని అమావాస్య అనగా సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి అమృతంగా మారి కిందికి వస్తుందని భక్తులు నమ్ముతారు. దీంతో ప్రవహించే గోదావరి నదిలో స్నానం ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. భక్తుల రద్దీతో ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ఘాట్ల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు పదివేలకు పైగా భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *