Bhupalapalli | రోడ్డు ప్రమాదంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి / గణపురం, జనవరి 30 (ఆంధ్రప్రభ ): జయశంకర్ జిల్లా గణపురం మండలం చెల్పూర్ కేటీపీపి వద్ద 353సి జాతీయ రహదారి పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేటీపీపి ఔటసోర్సింగ్ ఉద్యోగి మృతి చెందాడు.
కుందూరు పల్లికి చెందిన బానోత్ రాజేష్ 23 కేటీపిపి లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై ఇంటికి వెళ్తున్న క్రమంలో కేటీపిపి నుండి జాతీయ రహదారి పైకి చేరుకునే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో రాజేష్ కు తల,ముఖం పై బలమైన గాయాలు కావడంతో క్షతగాత్రుడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న గణపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్ మృతితో కుందూరు పల్లిలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.